సీపీఐ శత జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
కోరుట్ల: సీపీఐ శత జయంతి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ స్మారక భవన్‌లో సోమవారం బహిరంగ సభ కరపత్రాలు ఆవిష్కరించారు. విశ్వనాథం మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించిందని, ఈనెల 31న కోరుట్లలో శత జయంతి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సభకు పార్టీ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌలానా, రాస భూమయ్య, ఎండీ ముఖ్రం, రాధ, అశోక్, రమేశ్, ఎండీ.సమీర్, గని పాల్గొన్నారు.


