కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి

Dec 18 2025 7:55 AM | Updated on Dec 18 2025 7:55 AM

కేసుల

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి

మెట్‌పల్లి: ఈ నెల 21న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని మెట్‌పల్లి సీనియర్‌ సివిల్‌ మేజిస్ట్రేట్‌ నాగేశ్వర్‌రావు సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో బుధవారం లోక్‌అదాలత్‌పై సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారుల మధ్య రాజీ కుదిరితే లోక్‌ అదాలత్‌లో వాటిని సత్వరమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా క్రిమి నల్‌ కేసుల్లో అప్పీల్‌కు వెళ్లడానికి అవకాశముండదని, సివిల్‌ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజును వెనక్కి తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ మేజిస్ట్రేట్‌ అరుణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, అడిషనల్‌ పీపీ ఆనంద్‌గౌడ్‌, అసిస్టెంట్‌ పీపీ ప్రణయ్‌, న్యాయవాదులు ఉన్నారు.

పేర్ల మార్పుతో ఫలితం ఉండదు

జగిత్యాలటౌన్‌: పథకాల పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, మాహాత్ముడి గౌరవాన్ని తగ్గించేలా ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కుట్ర పూరితంగా మహాత్ముడి పేరును తొలగించాలనుకుంటే దేశప్రజలు క్షమించబోరని తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, చల్‌గల్‌, ధరూర్‌ సర్పంచులు జున్ను రాజేందర్‌, సురేందర్‌ ఉన్నారు.

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తిద్దాం

జగిత్యాల: కుష్ఠువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గురువారం నుంచి సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. ఈనెల 30 వరకు ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఏటా రెండుసార్లు సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సర్వే చేస్తారని, ఇందులో 735 మంది ఆశా కార్యకర్తలు, 247 మంది వైద్య సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. చర్మంపై మచ్చలు కన్పించినా.. కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యులను సంప్రదించాలన్నారు. 12 నెలల పాటు చికిత్స అందిస్తామని, మందులుఉచితంగాపంపిణీ చేస్తామని వెల్లడించా రు. డాక్టర్‌ అర్చన, సత్యనారాయణ పాల్గొన్నారు.

నేడు చలో హైదరాబాద్‌

జగిత్యాలటౌన్‌: కార్మికుల హక్కులు కాలరాసేలా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి 1976 ఎస్‌పీఈ చట్టాన్ని పునరుద్ధరించాలని గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌, అరవింద్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలో చలో హైదరాబాద్‌ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. కరోనా సమయంలో దేశ ప్రజలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న వేళ కేంద్రం నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. కోడ్‌ల ప్రకారం 44 కార్మిక చట్టాల నుంచి 15 చట్టాలను తొలగించారని తెలిపారు. దీంతో ఉద్యోగ భద్రత కరువైందన్నారు. మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యులు జి.ప్రణీత్‌, కె.నాగరాజు, జి.శ్రీనివాస్‌, కే.వెంకటేష్‌, డి.రాజు తదితరులు పాల్గొన్నారు.

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి1
1/2

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి2
2/2

కేసుల రాజీకి న్యాయవాదులు చొరవ తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement