ఒక్క ఓటూ కీలకమే..
కరీంనగర్‌అర్బన్/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ బు గ్గారం/సుల్తానాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడు విడతల్లో జి ల్లావ్యాప్తంగా ఎన్నికలు జరగగా బుధవారంతో తు ది సమరం ముగిసింది. ఒక్కో విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఫలితాలు ఆసక్తికరంగా ఉండటం విశేషం. ఒక్క ఓటూ ఎంత కీలకమో స్పష్టం చేసింది. మెజారిటీ అటుంచితే విజయమే అతి కష్టంపై వరించింది.
టై: కరీంనగర్ రూరల్ మండలంలోని బహుదూర్‌ఖాన్‌పేట గ్రామ పంచాయతీ 1వ వార్డులో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించగా టై అయింది. మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా బుర్ర మారుతి, బుర్ర సంపత్‌కుమార్, బుర్ర తిరుపతిలకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. డ్రా తీయగా మారుతి గెలుపొందారు.
01: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లి గ్రామ సర్పంచిగా పోటీచేసిన రామడుగు హరీశ్ ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ సర్పంచ్‌గా పొన్నాల సంపత్ ఒకే ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థికి ఏకానందంకు 642 ఓట్లు రాగా సంపత్‌కు 643 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో సర్పంచ్ అభ్యర్థులు అంజిత్‌రావుకు 437 ఓట్లు, ధర్మరాజుకు 438 ఓట్లు వచ్చాయి. ధర్మరాజును ఒక్కఓటు తేడాతో విజయం వరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో ఉమ్మెంతల శోభకు 213, పల్లెలక్ష్మికి 212 ఓట్లు రాగా.. ఒక్కోటు తేడాతో శోభ గెలిచింది.
02: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచిగా గోదరి శోభారాణి గెలుపొందారు. సమీప ప్రత్యర్థిఽ కనకలక్ష్మిపై 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శోభారాణికి 324 ఓట్లు పోలవగా కనకలక్ష్మికి 322 ఓట్లు పోలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కాశోల్ల పద్మకు వంద ఓట్లు రాగా, రొడ్డ భాగ్యకు 102 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో భాగ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.
03: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ సర్పంచ్‌గా శ్రీలత ఎన్నికయ్యారు. అగ్గని శ్రీలతకు 505 ఓట్లు పోలవగా రాసమల్ల అనూషకు 502 ఓట్లు పోలయ్యాయి. కేవలం మూడు ఓట్లతో శ్రీలత గెలుపొందారు.
06: చొప్పదండి మండలంలోని రేవెల్లి గ్రామ సర్పంచ్‌గా బందారపు అజయ్‌కుమార్ 6 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి రాజిరెడ్డిపై గెలుపొందారు. అజయ్‌కుమార్‌కు 385 ఓట్లురాగా ప్రత్యర్థి రాజిరెడ్డికి 379 ఓట్లు పోలయ్యాయి. రామడుగు మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచిగా వేల్పుల మల్లేశం తన ప్రత్యర్థిఽ తిరుమల్‌పై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మల్లేశంకు 145 ఓట్లు రాగా తిరుమల్‌కు 139 ఓట్లు పోలయ్యాయి.
07: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో కల్లూరు బాపురెడ్డి ఏడు ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి నమిలికొండ శ్రీనివాస్‌పై 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
08: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లెలో సర్పంచ్‌గా చొప్పరి శైలజ ప్రత్యర్థి పన్నాల స్వరూపపై 8 ఓట్ల తేడాతో గెలుపొందింది.
10: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామ సర్పంచిగా సంఘం అమృత సమీప ప్రత్యర్థిపై 10ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


