నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలి
పెగడపల్లి: ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని ఆర్డీవో మధుసూదన్‌తో కలిసి పరిశీలించారు. సామగ్రి పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు, సిబ్బంది వసతులపై ఆరాతీశారు. మూడో విడుత ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని వేర్వేరు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు మదన్‌మోహన్, రవికుమార్, డీఎస్పీ రఘుచందర్, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపీవో శశికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్
సత్యప్రసాద్


