కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. గోదాదేవికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తులసీదళార్చనతో పూజలు చేశారు. తిరుప్పావై గానం చేశారు. ఽఅమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. 30రోజులపాటు అమ్మవారికి నిత్యపూజలు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, భక్తులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే..
కథలాపూర్: మండలంలోని సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయాన్ని నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు భూములు కోల్పో తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్‌లో భూములకు అధిక ధర ఉందని, ఈ క్ర మంలో నిర్వాసితులకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కో రారు. లేనిపక్షంలో భూమికి బదులు సారవంతమైన భూమి కేటాయించాలన్నారు. యాసంగి పంటలకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆయన వెంట నాయకులు ఏనుగు తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
మామిడి పూత దశలో జాగ్రత్తలు తీసుకోవాలి
గొల్లపల్లి: మామిడి పూత దశలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కాత సమయంలో చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి దిగుబడి పొందవచ్చని ఉద్యానవన అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్ అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లిలోగల మామిడితోటలను మంగళవారం పరిశీలించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పటివరకు కేవలం 5 నుంచి 10 శా తం మాత్రమే తోటల్లో పూత కనిపిస్తోందన్నా రు. దీనికి వాతావరణ మార్పులే కారణమన్నా రు. క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులు చే సుకున్న వారి తోటల్లో పూత వచ్చిందన్నారు. ఆయన వెంట ఉద్యానవన అధికారి అర్చన, అధికారులు వంశీకృష్ణ, అన్వేష్, రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ పాం సాగుతో ఆర్థిక వృద్ధి
రాయికల్: ఆయిల్ పాం తోటలతో ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని ఉద్యానవన విస్తరణాధికారి రాజేశ్ అన్నారు. మంగళవారం బో ర్నపల్లిలోని ఆయిల్ పాం తోటలను పరిశీలించారు. ఆసక్తి గల రైతులు సంబంధిత ఏఈ వోలను సంప్రదించాలన్నారు. ఆయన వెంట లోహియా సంస్థ మేనేజర్ విజయ్, ఫీల్డ్ ఆఫీ సర్ రాజేశ్, రైతులు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల సందర్శన
బుగ్గారం: పంచాయతీ ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ఎంపీడీవో సుమంత్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 96 వార్డుల్లో 13 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో తెలిపారు. ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు తదితరులున్నారు.
కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం


