కార్యకర్తలకు అండగా ఉంటాం
ప్రత్యేక పాలనలో నిధులు డ్రా కొత్త సర్పంచులకు ఉత్త ఖాతాలే
జగిత్యాలరూరల్: సర్పంచులంటేనే గ్రామాల్లో ఒకరకమైన ప్రత్యేకత. గ్రామాల్లో ఎలాంటి పనులు చేయాలన్నా మొదట పంచాయతీ పాలకవర్గం ఆమోదం పొందాల్సిందే. పాలకవర్గం ఆమోదం తెలిపిన పనులను చేపట్టి ఇంజినీరింగ్ అధికారులు రికార్డు చేసిన తర్వాతే నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. గత సర్పంచుల పదవీకాలం ముగిసి.. గ్రామాల్లో దాదాపు 22నెలలపాటు ప్రత్యేక అధి కారుల పాలన సాగింది. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ ఖాతాల్లోని డబ్బును పూర్తిగా డ్రా చేశారు. దీంతో ప్రస్తుతం కొత్త సర్పంచులకు ఖాతాల్లో బ్యాలెన్స్ లేకపోవడంతో ఏ పని చేద్దామన్నా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పంచాయతీల్లో ఏర్పాట్లకు కష్టమే..
గ్రామ సర్పంచులుగా ఎన్నికై న వారు ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే పంచాయతీ కార్యాలయాలకు రంగులు, ఫర్నిచర్ కోసం కొత్త సర్పంచులు పంచాయతీ కార్యదర్శులను కోరుతుండగా.. నిధులు లేకపోవడంతో వారు ఏం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీకి సర్పంచులు కలర్లు వేయించడంతో పాటు, కొత్తగా ఫర్నిచర్ కొనుగోలు చేసి ఆఫీసులను ముస్తాబు చేసిన తర్వాతే ప్రమాణస్వీకారం చేయాలని ఆలోచన చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తేనే పనులు
చాలాకాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల నిలిపివేశాయి. దీంతో చాలా గ్రామపంచాయతీలు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు నిధులు విడుదల చేస్తేనే కొత్త సర్పంచులు ఏదైనా గ్రామాల అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంది.
జగిత్యాల: కార్యకర్తలకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను పార్టీ కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీ అకౌంట్లలోకి నిధులు వస్తాయని, సర్పంచ్, పాలకవర్గం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేంతవరకు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో ఖజానా ఖాళీ
కార్యకర్తలకు అండగా ఉంటాం


