చివరి విడతకు సర్వం సిద్ధం
ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,75,024 మంది ఓటర్లు ఇప్పటికే ఆరు సర్పంచులు, 228 వార్డులు ఏకగ్రీవం 113 పంచాయతీలు, 860 వార్డులకు పోలింగ్
జగిత్యాల: గ్రామపంచాయతీ చివరిదశ ఎన్నికలకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మొదటి, రెండోవిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడోవిడతలోనూ ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పెగడపల్లి, ధర్మపురిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది గ్రామాలకు చేరుకున్నారు. మూడో విడతలో 119 పంచాయతీలు, 1088వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే ఆరు సర్పంచులు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 పంచాయతీలు, 860 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ బూత్‌లకు తరలివెళ్లారు.
భారీ బందోబస్తు
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఇప్పటికే పోలీసులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మండలాలు: ధర్మపురి, బుగ్గారం,
ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి,
పెగడపల్లి గ్రామపంచాయతీలు : 119
వార్డులు : 1,088
ఓటర్లు : 1,75,024
పీవోలు : 1306
వోపీవోలు : 1703
పోలింగ్ కేంద్రాలు : 1088
ఏకగ్రీవమైన సర్పంచులు : 6
ఏకగ్రీవమైన వార్డుమెంబర్లు : 228
ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలు : 113
ఎన్నికలు జరిగే వార్డులు : 860
చివరి విడతకు సర్వం సిద్ధం


