పోస్టల్ బ్యాలెట్‌కు ఆసక్తి చూపని ఉద్యోగులు
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. వీరు సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా లెక్కిస్తారు. అయితే తాము ఓటు ఎవరికి వేశామో తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఓటు వేసేందుకు ఉద్యోగులు ఇష్టపడలేదు. రాయికల్ మండలంలోని 30 గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌కు 38, వార్డు సభ్యులకు 32 మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాయికల్‌లో పోస్టల్ బ్యాలెట్
వినియోగించుకుంటున్న ఉద్యోగి మహేశ్


