ఉప సర్పంచ్ @ రూ.25 లక్షలు
కాంగ్రెస్ మద్దతుదారులకు అండగా నిలవండి
పెగడపల్లి/వెల్గటూర్/బుగ్గారం: గ్రామాల అభివృద్ధికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకుని తద్వారా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పెగడపల్లి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లోని పలు గ్రామాలోల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్మదర్శి శోభారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వెల్గటూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, నాయకులు రాంమోహన్‌రావు, ఉదయ్, మురళి, సందీప్, శ్రీకాంత్‌రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఈసారి ఆ పదవికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి రిజర్వేషన్ అనుకూలంగా రాని చోట్ల చాలామంది కీలక నేతలు వార్డు మెంబర్లుగా పోటీచేశారు. ఉప సర్పంచ్ పదవి దక్కించుకుని తమ ప్రాధాన్యతను చాటుకోవాలన్న ఉద్దేశంతో ఎంత ఖర్చుకై నా వెనుకాడటం లేదు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. చాలాచోట్ల ఉప సర్పంచ్ పదవికి వేలం వేసి దక్కించుకున్నారు.
రూ.5లక్షల నుంచి..
మొదటి విడత ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షలు వెచ్చించడం విస్మయం కలిగించింది. కోరుట్ల మండలంలో ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ పదవికి ఒక్కోవార్డు మెంబర్‌కు రూ.2 లక్షల చొప్పున రూ.25 లక్షలు వెచ్చించాడు. కథలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి రూ.20 లక్షలు చెల్లించారు. మరో గ్రామంలో రూ.8 లక్షలు వార్డు మెంబర్లకు చెల్లించారు. మల్లాపూర్ మండలంలో రూ.5 లక్షలు వెచ్చించారు. మెట్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలో 23 గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవి పొందడానికి డబ్బులు వెచ్చించడం గమనార్హం.
అవిశ్వాసం వస్తే..
ఉప సర్పంచ్ పదవికి రెండున్నరేళ్ల తరువాత మళ్లీ అవిశ్వాసం పెట్టవచ్చు. ఇపుడు డబ్బులు చెల్లించి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్న వాళ్లు రెండున్నర ఏళ్ల తరువాత అవిశ్వాస గండం ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వార్డు మెంబర్లకు డబ్బులు ఇచ్చి ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారు మళ్లీ రెండున్నర ఏళ్లకు అవిశ్వాసం పెట్టరాదన్న ఒప్పందంతో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. కానీ రెండున్నర ఏళ్ల వరకు గ్రామంలో పరిస్థితులు ఏలా ఉంటాయో..? అప్పటికి అవిశ్వాసం ప్రస్తావన వస్తే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు.. చేసుకున్న ఒప్పందాలు ఉత్తవే అవుతాయన్న సంశయం ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారిని వెంటాడుతోంది.
ఉప సర్పంచ్ @ రూ.25 లక్షలు
ఉప సర్పంచ్ @ రూ.25 లక్షలు


