నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

Dec 15 2025 9:03 AM | Updated on Dec 15 2025 9:03 AM

నృసిం

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని ఆదివారం జిల్లా జడ్జి రత్నపద్మావతి, ప్రిన్సిపల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ లావణ్య దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన మేళతాళాలు, సాంప్రదాయ రీతుల్లో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ జక్కు రవీందర్‌, అర్చకులు తదితరులున్నారు.

గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు

ధర్మపురి: షష్టి మాసం, ఆదివారం సెలవు దినం సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు కిటకిటలాడాయి. మల్ల న్న పట్నాల సందర్భంగా తమ తమ దేవుళ్లను భక్తులు గోదావరి నీటితో శుభ్రం చేశారు.

దత్తాత్రేయ ఆలయానికి రూ.5లక్షల విరాళం

కోరుట్ల: కోరుట్ల సాయిబాబా ఆలయంలో నిర్మిస్తున్న దత్తాత్రేయ ఆలయం, రమాసత్యనారాయణ స్వామి, లలితాంబిక ఆలయాల నిర్మాణం కోసం వ్యాపారవేత్త, సామాజిక వేత్త సంకు సుధాకర్‌ రూ.5 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్‌ బాలె నర్సయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు రాచకొండ దేవయ్య, నేమూరి భూమయ్య తెలిపారు. సుధాకర్‌ను కాంగ్రెస్‌ కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి

బుగ్గారం: బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం బుగ్గారం మండలకేంద్రంలో పాటు గోపులాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన సర్పంచులకు సన్మానం

మల్లాపూర్‌: నూతనంగా ఎన్నికై న సర్పంచులు తోట శ్రీనివాస్‌, చిట్యాల లక్ష్మణ్‌ను బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సన్మానించారు. గ్రామాల్లో నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు కమిటీ జిల్లా మాజీ స భ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ ముద్దం శరత్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

నృసింహుడిని   దర్శించుకున్న జిల్లా జడ్జి1
1/4

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

నృసింహుడిని   దర్శించుకున్న జిల్లా జడ్జి2
2/4

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

నృసింహుడిని   దర్శించుకున్న జిల్లా జడ్జి3
3/4

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

నృసింహుడిని   దర్శించుకున్న జిల్లా జడ్జి4
4/4

నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement