శ్రీరాంనగర్‌లో మహిళా పాలకవర్గమే..
రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలోని నాలుగు వార్డుల్లో నలుగురూ మహిళలే విజ యం సాధించారు. సర్పంచ్‌గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలిగా కూస దేవమ్మ తన ప్రత్యర్థి జోగుల సరితపై విజయం సాధించారు. రెండో వార్డు సభ్యురాలుగా శేర్ కిష్టమ్మ ఏకగ్రీవమయ్యా రు. మూడో వార్డు సభ్యురాలిగా కొంపల్లి సుమలత తన ప్రత్యర్థి జానయ్యపై గెలిచారు. అలాగే నాలుగో వార్డు సభ్యురాలిగా కొంపల్లి ప్రియాంక తన ప్రత్యర్థి లక్ష్మీపై గెలుపొందారు. వీరిలో ఉపసర్పంచ్‌గా కొంపల్లి ప్రియాంకను ఎన్నుకున్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
సర్పంచ్, వార్డు సభ్యులు బీజేపీని వీడి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.


