కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
ధర్మపురి: కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రాయపట్నం, కమలాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామాలను మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి అందుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు, ఆయా గ్రామాల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


