రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని, 853 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. 57 రూట్స్‌లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైలతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు చెప్పారు.
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
జగిత్యాలరూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేశ్ తెలిపారు. శనివారం జగిత్యాల అర్బన్ మండలంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్‌చేసుకుని ప్యాక్ చేయాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా నోడల్ అధికారులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


