దీపావళికి గుర్తింపుపై సంబరాలు
దీపావళికి సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చోటునివ్వడాన్ని హర్షిస్తూ అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చుతూ నిర్ణయించడం పట్ల దీపాలు వెలిగించి..టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి , రిటైర్డ్ ప్రిన్సిపల్ డా.మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
– కొత్తపల్లి(కరీంనగర్)


