ఆ రెండు పంచాయతీలు పవర్‌ఫుల్
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి, టీటీఎస్ అంతర్గాం పవర్‌ఫుల్ పంచాయతీలు. కుందనపల్లి ఓటర్లు 1,850 మంది ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్టీపీసీ నిర్వాసిత గ్రామం. వసతుల కల్పనకు ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఎన్టీపీసీ బూడిద చెరువు కూడా ఉంది. బూడిదకు డిమాండ్ ఏర్పడింది. ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ డిపోలతో పాటు ఐవోసీ, హెచ్‌పీ, ఐబీపీ పెట్రోల్ బంకుల స్థిరాస్థుల నుంచి అత్యధికంగా పన్నుల రూపేణా నిధులు సమకూరుతాయి. ఏటా సుమారు రూ.కోటి వరకు పంచాయతీ ఖజానాకు జమవుతుంది. దీంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడుతున్నారు.
టీటీఎస్ అంతర్గాంలో 600 ఎకరాలు..
టీటీఎస్ అంతర్గాం పరిధిలో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్ని గ్రామాలకు జంక్షన్. విమానశ్రయం, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండడంతో సర్పంచ్ పదవిపై ప్రతీఒక్కరి దృష్టి పడింది. దీంతో ఎలాగైనా సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రామంలో 1,302 మంది ఓటర్లు ఉండగా, ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు.
ఆ రెండు పంచాయతీలు పవర్‌ఫుల్


