రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి
మెట్‌పల్లి(కోరుట్ల): ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది నాణ్యమైన సేవలందించాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొని ఆయన మాట్లాడారు. రోగులకు సేవలే కాకుండా వైద్య విజ్ఞాన్ని కూడా అందించాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు గదులను పరిశీలించారు. నిధులు మంజూరు కాక నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఆయనకు తెలుపగా, రాతపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకపోతానని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
వెల్గటూర్(ధర్మపురి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. నవంబర్ 16న హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సీనియర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన జైనపురం సాయికుమార్, హుజూరాబాద్ పెంచికల్‌పేటకు చెందిన చిలుముల సుమన్‌లు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 15 నుంచి 20 వరకు వెస్ట్‌బెంగాల్‌లో జరిగే 54వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ అశోక్, అసోసియేషన్ బాధ్యులు శ్రీనివాస్, అనూప్‌రెడ్డి, వీర్‌పాల్, రాజ్‌కుమార్, మహేశ్ తదితరులు అభినందించారు.
షెడ్ల కేటాయింపుపై సర్వే
జగిత్యాల: జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పాతబస్టాండ్ నుంచి గొల్ల్లపల్లి రోడ్‌లో, సివిల్ ఆస్పత్రి వద్ద షాపులు కోల్పోయిన వీధి వ్యాపారులకు గొల్లపల్లి రోడ్‌లో 37 షెడ్లను నిర్మించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి వివరాలు సిద్ధం చేసినా ఆర్డర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన అర్హులైన వీధివ్యాపారులకు షెడ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగేందుకు తుది జాబితా కోసం అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. అలాగే కొందరికి ఇప్పటికే కేటాయించినప్పటికీ వారు వేరే వ్యక్తులకు ఇవ్వడం లేదా, తాళం వేసి ఉపయోగించకుండా ఉండటాన్ని గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే వాటిని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు.
పశువైద్య కేంద్రం తనిఖీ
జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం పొలాస పశువైద్య ఉప కేంద్రాన్ని జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి బొల్లం ప్రకాశ్ శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి శుభ్రంగా, అన్ని వసతులు ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వెటర్నరి లైవ్‌స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్ ఉన్నారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి


