గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా

Dec 13 2025 7:49 AM | Updated on Dec 13 2025 7:49 AM

గ్రామ

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా

● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం: గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు అన్ని విధాలుగా సహకారమందిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు పలువురు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీలకతీతంగా ప్రతీ సర్పంచ్‌కు గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారమందిస్తానన్నారు.

సర్పంచులుగా సింగిల్‌ విండో చైర్మన్లు

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం సింగిల్‌విండో చైర్మన్‌ బద్దం గోపి, తిమ్మాపూర్‌ విండో చైర్మన్‌ బాస శ్రావణ్‌ సర్పంచులుగా గెలుపొందారు. సర్పంచ్‌ పదవులకు జనరల్‌గా రిజర్వేషన్‌ కేటాయించడంతో బరిలో నిలిచి గెలిచారు. సింగిల్‌విండో పదవికి 15 రోజుల్లో రాజీనామా చేయనున్నారు.

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
1
1/2

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
2
2/2

గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement