హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు వివరించాలి
జగిత్యాల: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ గురించి ప్రజలకు వివరించాలని, ఇది అత్యంత కీలకమైందని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఫార్మసీ అధికారులు, వైద్యాధికారులకు శిక్షణ కల్పించారు. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణాలను ఈ వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో అవగాహన, ఎర్లీ వ్యాక్సినేషన్, తల్లిదండ్రుల పాత్ర అత్యవసరమన్నారు. ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, హ్యూమన్ పాపిలోమ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ జననేంద్రియాలపై పులిపిర్లు వస్తుంటాయని, ఈ వ్యాక్సిన్ వల్ల రక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోగ్య సిబ్బంది కలిసి పనిచేస్తే విజయవంతం చేయవచ్చన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ, కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఆశా కార్యకర్తలు సర్వే చేయాలని, ఎర్రని రాయిరంగు, గోధుమరంగు మచ్చలు ఉంటే రెఫర్ చేయాలని సూచించారు.
ప్రజలకు సేవలందించాలి
ప్రజలు ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విశ్వ జనని ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా లీగల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని, వైద్యం వారి హక్కు అని, వారికి కావాల్సిన వైద్యసే వలు అందించాలన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, లీగల్ అడ్వైజర్ చంద్రమోహ న్, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధి కారి శ్రీనివాస్, ఆర్‌ఎంవోలు శ్రీపతి పాల్గొన్నారు.


