సాధారణ ప్రసవాలు పెంచాలి
రాయికల్/మల్లాపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్త్‌కవరేజ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, డయాలసిస్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గైనాలజిస్ట్ డాక్టర్ ఒడ్నాల రజిత, డాక్టర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్‌సీని సందర్శించారు. బీపీ, షుగర్ రోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏఎన్‌ఎం లచ్చమ్మపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. వైద్యాధికారి డాక్టర్ వాహిని, సీహెచ్‌వో రామ్మోహన్, హెల్త్ సూపర్‌వైజర్లు శకుంతల, విజయ తదితరులు పాల్గొన్నారు.


