మూడో ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్‌లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ అధికారులు 1,531, ఇతర అధికారులు 2,031 మంది రెండో విడత కోసం కేటాయించినట్లు వివరించారు. 7 మండలాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, పోస్టల్ బ్యాలెట్స్ తరలింపు, ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అబ్జర్వర్ రమేశ్ పాల్గొన్నారు.
గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్‌లోనీ ఈవీఎం గోదాములను పరిశీలించారు. ప్రతినెలా తనిఖీల్లో భాగంగా గోదాములను పరిశీలించడం జరిగిందని, ఈవీఎంల భద్రత, సీసీకెమెరాల పనితీరు, గోదాముల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.


