నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!

Nov 27 2025 6:23 AM | Updated on Nov 27 2025 6:23 AM

నామిన

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!

● జెడ్పీసీఈవో గౌతమ్‌రెడ్డి

అన్ని జాగ్రత్తలు తప్పనిసరి లేకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం నేటినుంచి తొలివిడత నామినేషన్ల పర్వం

అభ్యర్థులు 21 ఏళ్లు నిండి ఉండాలి

సంబంధిత ఓటరు లిస్ట్‌లో ఓటరు నమోదై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే కులం సర్టిఫికెట్‌ జతపర్చాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.వెయ్యి, జనరల్‌ అభ్యర్థులు రూ.2 వేల సొమ్ము డిపాజిట్‌ చేయాలి.

నేర చరిత్ర, చర, స్థిర ఆస్తులతో కూడిన అఫిడవిట్‌ ఇద్దరు సాక్షులతో సంతకాలు పెట్టించి ఇవ్వాలి.

ఎన్నికల ఖర్చు వివరాలతో నివేదిక అందజేయాలి.

ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదికగా ఉండాలి.

నామినేషన్‌ పత్రంలో పార్ట్‌–1లో ప్రతిపాదిత సంతకం, పార్ట్‌–2, 3లో అభ్యర్థి సంతకం ఉండాలి.

గ్రామపంచాయతీ పన్ను చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్‌ పొందాలి.

సెప్టెంబర్‌ నుంచి బ్యాంక్‌ అకౌంట్‌తో కూడిన వివరాలు పొందుపర్చాలి.

జగిత్యాలజోన్‌: మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు (షష్టి తీర్థాలు) నవంబర్‌లోనే ఉంటాయి. భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ.. డిసెంబర్‌ 20వరకు మందు, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ సమయంలోనే సర్పంచ్‌ ఎన్నికలు రావడం.. పోటీచేసే అభ్యర్థులు విందులు ఇచ్చే ఆస్కారం ఉండడం మద్యంప్రియులకు సంకటంగా మారింది. షష్టివారాలు పూర్తయ్యాక దావత్‌ అడుగుదామంటే అప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగుస్తాయి. తర్వాత ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. మద్యం, మాంసం తినని ఓటర్లు.. ‘ఇప్పుడు ఒక్కపొద్దులు ఉన్నాయి. మందు బాటిల్‌ పంపించు.. ఇప్పుడు దావత్‌ ఇస్తే రాలేను..’ అంటూ చెబుతున్నారు. మరోవైపు అభ్యర్థులు ఒక్కొక్కరికి బాటిల్‌ పంపిస్తే.. మిగతా ఓటర్ల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల కోరికలను చూసి తొలినాళ్లలోనే ఇలా ఉంటే ఎన్నికల తేదీ వరకు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

జగిత్యాలజోన్‌: జిల్లాకేంద్రం చుట్టుపక్క గ్రామాల్లో సర్పంచ్‌స్థానాలకు భలే గిరాకీ ఏర్పడింది. శివారు పంచాయతీల్లో పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఎంత ఖర్చయినా ఫర్లేదు.. పోటీలో ఉండాల్సిందేనన్న ఊపుతో ఉన్నారు. జిల్లాకేంద్రం చుట్టూ ఏడెనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భూముల ధరలు రూ.కోట్లు పలుకుతుండడమే దీనికి కారణమని పలువురు భావిస్తున్నారు. ‘ఓడితే అరెకరం.. గెలిస్తే ఐదెకరాలు’ అనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. జగిత్యాలను ఆనుకుని ఉన్న జగిత్యాల అర్బన్‌ మండలంలోని తిప్పన్నపేట జనరల్‌, హస్నాబాద్‌ జనరల్‌ ఉమెన్‌, ధరూర్‌ జనరల్‌ స్థానాలయ్యాయి. ఈ పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. జగిత్యాల రూరల్‌ మండలంలోని తిమ్మాపూర్‌ జనరల్‌, తాటిపల్లి బీసీ జనరల్‌, మోరపల్లి జనరల్‌, లక్ష్మీపూర్‌ జనరల్‌ మహిళ, హన్మాజీపేట జనరల్‌ మహిళ, గుల్లపేట జనరల్‌, చల్‌గల్‌ జనరల్‌, అంతర్గాం జనరల్‌ మహిళ, అనంతారం జనరల్‌ మహిళగా రిజర్వేషన్‌ ఖారారైంది. ప్రధానంగా జనరల్‌, జనరల్‌ మహిళ స్థానాల్లో పోటీ ఉత్కంఠగా మారనుంది.

ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి

జగిత్యాల: ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని అన్నారు. బుధవారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, జియో లొకేషన్‌ టీ పోల్‌ వెబ్‌సైట్‌ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ మొదటి విడతలో 7 మండలాల్లో 122 గ్రామపంచాయతీలు, రెండో విడతలో 144, మూడో విడతలో 119 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

జగిత్యాలరూరల్‌: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. రికార్డులు, ఎన్నికల నిర్వహణ పనితీరును తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సిబ్బందికి ‘ఉపాధి’

ఇప్పుడు షష్టి వారాలు..బాటిల్‌ పంపించు..

ఆ సర్పంచ్‌ స్థానాలకు భలే గిరాకీ

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

రాయికల్‌: సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ స్థా నానికి పోటీచేసే అభ్యర్థులు నామి నేషన్‌ పత్రాల్లో అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలు..

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!1
1/3

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!2
2/3

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!3
3/3

నామినేషన్‌ వేస్తున్నారా.. ఒక్క నిమిషం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement