కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సహాయ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే 96662 34383 నంబర్‌లో సంప్రదించాలని, 24/7 సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నోడల్ అధికారులుగా జిల్లా సంక్షేమాధికారి నరేశ్, పౌరసంబంధాల శాఖ అధికారి నరేశ్, వ్యవసాయాధికారి భాస్కర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.
ఎయిడ్స్ నివారణకు కృషిచేయాలి
జగిత్యాల: ఎయిడ్స్ ప్రమాదకరమైన వ్యాధి అని, నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. బుధవారం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌పీవో సభ్యత్య నమోదులో జిల్లా రెండో స్థానం
జగిత్యాలఅగ్రికల్చర్: సొసైటీల్లో ఏర్పాటు చేస్తున్న ఎఫ్‌పీవో (ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉందని సహకార అధికారి సీహెచ్.మనోజ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 52 సహకార సంఘాల్లో 16 సంఘాలను ఎఫ్‌పీవోగా తీర్చిదిద్దుతున్నామని, 16 ఎఫ్‌పీవోల్లో సభ్యత్య నమోదు వేగవంతం చేయాలని కోరారు. సంఘం వసూలు చేసిన మొత్తానికి.. నాబార్డు అంతే మొత్తంలో ఆర్థికసాయం చేస్తుందన్నారు. ఎఫ్‌పీవోల ద్వారా వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. సంఘ సీఈవోలు, సహకార శాఖ శిక్షణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
28న వృద్ధులకు జెరియాట్రిక్ వైద్యసేవలు
జగిత్యాల: సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈనెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేకమైన జెరియాట్రిక్ వైద్యసేవలు అందించడం జరుగుతుందని జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక నిపుణులచే పరీక్షలు చేస్తారని సీనియర్ సిటిజన్స్ వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రామాజీపేట విద్యార్థిని
రాయికల్: మండలంలోని రా మాజీపేట జెడ్పీ ఉన్న త పాఠశా ల విద్యార్థిని ఎనుగంటి సాహిత్య రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో డిసెంబర్‌లో జరిగే పోటీల్లో సాహిత్య పాల్గొననుంది. సాహిత్యను హెచ్‌ఎం గజ్జెల నరేందర్, గ్రామస్తులు అభినందించారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు..
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బాదినేని శ్రావణి ఎస్జీఎఫ్ జాతీయస్థాయి అండర్–17 ఖో ఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం నల్ల రాజయ్య తెలిపారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో శ్రావణి ప్రతిభ చాటింది. శ్రావణిని పీడీ నవీన్, ఉపాధ్యాయులు అభినందించారు.
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం


