కొనుగోళ్లు వేగవంతం చేయండి
రాయికల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ మండలం కట్కాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని రైతులు ఆయనకు ఫిర్యాదు చేయగా.. అధికారులతో మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సంబంధిత రైస్‌మిల్లులో దిగుమతి జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట నాయకులు సుధాకర్‌రెడ్డి, రాజమౌళి, లక్ష్మణ్, మండల నాయకులు గోపి రాజిరెడ్డి, తంగెళ్ల రమేశ్, మహిపాల్‌రెడ్డి, మహేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో పూజలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణంలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకులు కమటాల శ్రీనివాస్ ఉన్నారు.


