రైతులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలి
సారంగాపూర్: రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వరి, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు దాటినా ఇప్పటికి కొనుగోళ్లు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఫసల్‌బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, చుక్క అంజి, మాజీ సర్పంచ్‌లు భైరి మల్లేశం, గుర్రం స్వామి, భూక్య సంతోష్ ఉన్నారు.


