కార్తీక పౌర్ణమికి ముస్తాబు
గర్భగుడిలోని శివలింగం
ఆలయ గర్భగుడిలోని సీతారాముల విగ్రహాలు
వాల్గొండలోని శ్రీరామలింగేశ్వర ఆలయం
మల్లాపూర్: హరిహరక్షేత్రంగా గుర్తింపు పొంది.. వాల్గొండ గ్రామం గోదావరి తీరాన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమికి సిద్ధమయ్యారు. పౌర్ణమి రోజున లక్ష దీపాలతో అలంకరించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి ప్రభాకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ తెలిపారు. లక్ష దీపాలంకరణకు వివిధ ప్రాంతాల నుంచి సాధువులు హాజరవుతున్నారని వివరించారు.


