త్వరలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. లక్ష్మిపూర్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిధుల సమస్యతో కొంత జాప్యమైందని, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు ప్రీప్రైమరీ విద్య
జగిత్యాల: పిల్లలు ప్రీప్రైమరీ విద్యకు దూరం కాకూడదనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ హౌసింగ్ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంక్షేమాధికారి నరేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, చెట్‌పల్లి సుధాకర్, రాజ్‌కుమార్, గంగమల్లు, నవీన్ పాల్గొన్నారు.
ఐఎంఏ యాక్టివిటి రిపోర్ట్ పుస్తకావిష్కరణ
ఐఎంఏ 2024–25 ఆల్‌రౌండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు సాధించిందని ఎమ్మెల్యే అన్నారు. శనివారం యాక్టివిటి రిపోర్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్‌రెడ్డి, సెంట్రల్ కమిటీ మెంబర్ అశోక్, గురువారెడ్డి పాల్గొన్నారు.


