కాశీలో రాజన్న కల్యాణం
వేములవాడ: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవో రమాదేవి, అర్చకులు, అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు వారణాసి క్షేత్రంలో శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం నిర్వహించారు. ఈవో రమాదేవి, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఒన్నారం భాస్కర్, స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్‌శర్మ, ఉపప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, నమిలకొండ రాజేశ్వరశర్మ, అర్చకులు మామిడిపల్లి శరత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


