వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో శనివారం సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీలలితా సేవా ట్రస్టు సభ్యులు ఆలయ ఆవరణలో వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో జ్యోతులను పెట్టి వెలిగించారు. ఏఈవోలు శ్రావణ్‌కుమార్, అశోక్‌కుమార్‌లు సుహాసినీలకు వాయనం, పసుపు కుంకుమ, అక్షింతలు, గాజులు, స్వామివారి ఫొటోలను అందజే శారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, జూనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్, సింహాచారి తదితరులు ఉన్నారు.
వైభవంగా కార్తీక దీపోత్సవం


