సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
చొప్పదండి: మండంలోని రుక్మాపూర్ శివారు సాంఘీక సంక్షేమ సైనిక శిక్షణ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు ఎస్‌జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన అండర్– 19 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో కె.హోమ్‌రాజ్ 400 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, జె.అచల్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. లాంగ్‌జంప్‌లో జి.గణేశ్ గోల్డ్, 100 మీటర్ల రన్నింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. జె.రోషన్ 300 మీటర్ల రన్నింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈసందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ లింగయ్య, శ్రీనివాస్, ప్రమోద్ రాజు అభినందించారు.
సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ


