‘పది’ ఫలితాల్లో ఫస్ట్ రావాలి
మల్లాపూర్ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానం నిలిపేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో రాము అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూరిబా విద్యాలయాలను గురువారం సందర్శించారు. విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సులభంగా ఆకళింపు చేసుకునేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎంఈవో కేతిరి దామోదర్‌రెడ్డి, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ చంద్రమోహన్‌రెడ్డి, భూమేశ్, రాజేందర్, శ్రీలత, ఆధ్యాపకులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.


