హాస్టల్ పరిశీలన
జగిత్యాలటౌన్: హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ధరూర్ క్యాంపులోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను సందర్శించారు. ఇటీవల పిడుగుపడి గాయపడిన హిమేశ్‌చంద్ర యశోద ఆస్పత్రిలో చికి త్స అందిస్తున్నామని, మంత్రి అడ్లూరి చొరవతో రూ.5లక్షల ఎల్‌ఓ సీ మంజూరు చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పిడుగు పాటుకు గురైన హాస్టల్ గది, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకును పరిశీలించారు. మరమ్మతు కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు.


