‘మోంథా’తో 19,128 ఎకరాల్లో పంట నష్టం
జగిత్యాలఅగ్రికల్చర్: మోంథా తుపాన్ ప్రభా వంతో జిల్లాలో 17,748 రైతులకు చెందిన 19,128 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు డీఏవో భాస్కర్ తెలిపారు. జిల్లాలోని 230 గ్రామాల్లో 17,982 ఎకరాల్లో వరి, 1146 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, కథలాపూర్‌లో 2,934 ఎకరాలు, కోరుట్లలో 2201, ఇబ్రహీంపట్నంలో 1326, ఎండపల్లిలో 1619, మెట్‌పల్లిలో 1570, మల్లాపూర్‌లో 1046, రాయికల్‌లో 1122, పెగడపల్లిలో 1960 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి
జగిత్యాలరూరల్: అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకోవాలని, వర్షాలు ముగియగానే తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆరబెట్టని ధాన్యం కేంద్రాలకు తెస్తే ఇతర రైతులకు ఇబ్బంది అవుతుందన్నారు. తహసీల్దార్ వరందన్, ఆర్‌ఐ భూమయ్య పాల్గొన్నారు.
రాయికల్‌లో..
రాయికల్: మండలంలోని అల్లీపూర్, సింగారావుపేటలోని కొనుగోలు కేంద్రాలను లత పరిశీలించారు. రైతులకు ఇబ్బంది రానీయొద్దని అధికారులకు సూచించారు.
ఎస్సారెస్పీ 26 గేట్లు ఓపెన్
జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.09 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. అలాగే ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
జగిత్యాలరూరల్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. రూరల్ మండలంలోని హైదర్‌పల్లిలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలు, తడిసిన ధాన్యాన్ని రై తులతో కలిసి గురువారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్ర భుత్వం విఫలమైందన్నారు. కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించాలని డిమాండ్ చేశారు. భూమన్న, చిన్న రాజన్న, గంగారెడ్డి పాల్గొన్నారు.
‘మోంథా’తో 19,128 ఎకరాల్లో పంట నష్టం
‘మోంథా’తో 19,128 ఎకరాల్లో పంట నష్టం
‘మోంథా’తో 19,128 ఎకరాల్లో పంట నష్టం


