‘అమృత్’ మరింత ఆలస్యం
భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్న రైతులు అమృత్ జలం కోసం బల్దియాకు రూ.15 కోట్లు
రాయికల్: రాయికల్ పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకం రాయికల్ బల్దియా ప్రజలకు కలగానే మిగలిపోయే అవకాశం కనిపిస్తోంది. పట్టణంలోని 12 వార్డుల్లో 20 వేల జనాభా ఉంది. వీరికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు నిధులు మంజూరై రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ స్థలం లేకపోవడంతో అడుగుముందుకు కదలడం లేదు. పథకానికి 20 గుంటల స్థలం అవసరం ఉండగా.. ఇచ్చేందుకు రైతులెవరూ ముందుకు రావడంలేదు. దీంతో పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రూ.15 కోట్లు విడుదల
పట్టణానికి రూ.15 కోట్లు మంజూరైనా.. ప్రభుత్వం టెండర్ పూర్తి చేసినా.. 20 గుంటల భూ మి దొరకడం లేదు. ఇటీవల రెవెన్యూ, మున్సి పల్ అధికారులు స్పందించి కుర్మ మల్లారెడ్డి, నారాయణరెడ్డి, ప్రేమ్‌రెడ్డికి చెందిన 20 గుంట లు గుర్తించి కొనుగోలు చేసేందుకు ల్యాండ్ ఆ క్వేషన్ అధికారులకు నివేదిక అందించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ సంబంధిత రైతుల భూములను పరిశీ లించేందుకు వెళ్లగా.. తమకు భూమి ఇవ్వడం ఇష్టం లేదని అనడంతో పథకం మళ్లీ మొదటికి వచ్చింది. భూమి ఇస్తే పట్టణ ప్రజలకు అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉందని, రైతులకు న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చినా ఎవరూ సుముఖత చూ పడం లేదు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు స్పందించి పట్టణానికి స్వచ్ఛమైన నీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
రాయికల్ పట్టణంలో అమృత్ 2.0 పథకానికి 20 గుంటల స్థలాన్ని గు ర్తించాం. రైతులు ఇవ్వడానికి ప్రస్తుతం విముఖత చూపడంతో ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్
‘అమృత్’ మరింత ఆలస్యం


