మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్‌కు అనుమతి తప్పనిసరి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, కొత్తగా మంజూరుకు రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సియూ) అనుమతి తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పర్యావరణం, ఆటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించామని, ప్రజాభిప్రాయం కోసం https: //jagityal .telangana.gov.inనందు పొందుపరిచామని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికపై అభిప్రాయాలను మైనింగ్ కార్యాలయానికి 21రోజుల లోపు పంపాలని సూచించారు.
పెగడపల్లిలో అత్యధిక వర్షపాతం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు పెగడపల్లిలో 113.3 మి.మీ వర్షం కురిసింది. కోరుట్లలో 103, మెట్‌పల్లిలో 101, కథలాపూర్‌లో 99.5, మల్యాలలో 99.3, భీమారంలో 94.5, ధర్మపురిలో 55.5, బీర్‌పూర్‌లో 36, సారంగాపూర్‌లో 84, కోరుట్లలో 76, వెల్గటూర్‌లో 56, మల్లాపూర్‌లో 65.3, బుగ్గారంలో 66.3, జగిత్యాల రూరల్‌లో 63.3, రాయికల్‌లో 73.5, జగిత్యాల అర్బన్‌లో 81.8, మేడిపల్లిలో 77.3, ఎండపల్లిలో 65, ఇబ్రహీంపట్నంలో 77.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
శ్రీవేంకటేశ్వరాలయంలో తిరునక్షత్ర వేడుకలు
కోరుట్ల: పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస తిరునక్షత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు బీర్నంది నర్సింహాచారి, ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్‌కు అనుమతి తప్పనిసరి


