గోదావరి మహాహారతి పోస్టర్ ఆవిష్కరణ
ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరికి నవంబర్ 9న నిర్వహించే మహాహారతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. మహాహారతి రాష్ట్ర కో–కన్వీ నర్ రాంసుధాకర్ ఆధ్వర్యంలో గోదావరి వద్ద నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించా రు. 2012లో మహాహారతి వ్య వస్థాపక అధ్యక్షులు మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్యక్రమాన్ని ఏటా వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులు పె ద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. నాయకులు బద్రీనాథ్, క్యాతం వెంకటరమణ, లవన్‌కుమార్, బండారి లక్ష్మణ్, మంచె రాజేశ్ ఉన్నారు.


