స్థలం సరిపోవడం లేదు
కొనుగోలు కేంద్రాలకు స్థలం సరిపోవడం లేదు. ఐదారుగురు రైతులు ధాన్యం పోయగానే నిండిపోతున్నాయి. స్థలం లేక రెండెకరాల పొలం కోయించడం ఆపిన. పొలంలో ధాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితి లేదు. పొలం కోయగానే కొనుగోలు కేంద్రానికే తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్
ఆరబెట్టిన తర్వాతే తేవాలి
హర్వేస్టర్‌తో వరి కోయించి నేరుగా కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడే ఆరబెడుతున్నారు. దీనివల్ల తోటి రైతులకు ఇబ్బంది కలుగుతోంది. రైతులు ఎవరిపొలంలో వారు ఆరబెట్టి తేమశాతం వచ్చాక కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే త్వరగా కాంటా అవుతుంది.
– వడ్డెపల్లి భాస్కర్, డీఏవో
స్థలం సరిపోవడం లేదు


