మత్తుకు దూరంగా ఉండాలి
జగిత్యాల: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, భవిష్యత్ నాశనం అవుతుందని డీఈవో రాము అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలతో ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు చదువు, వ్యక్తిత్వం నాశనం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో మత్తు నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్, అంగన్‌వాడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


