అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ
ధర్మపురి: కార్తీక సోమవారం సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో మన సారె – మనసారా కార్యక్రమంలో భాగంగా ఒడిబియ్యం, చీరసారె సమర్పించారు. శైవక్షేత్ర వనిత శక్తి ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలు ఒడిబియ్యంతో అమ్మవారి నామ సంకీర్తనలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.
కోటిలింగాలలో గంగాహారతి
వెల్గటూర్: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి సన్నిధిలో గోదావరికి గంగాహారతిని శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించారు. నదిలో దీపాలు వదిలారు. ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోపిక, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్‌రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, కమిటీ సభ్యులు గుమ్ముల వెంకటేశ్, రాపాక రాయకోటి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి
కోరుట్ల: ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, ఆయుధాలు పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. డీఎస్పీ రాములు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు సురేష్ బాబు, అనిల్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
కొండగట్టులో దీపోత్సవం
మల్యాల: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ
అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ
అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ


