రైతులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: రానున్న రెండురోజులు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి, పత్తి, మొక్కజొన్న కేంద్రాల వద్ద వర్షాలతో నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజులపాటు పంట కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు.
సహస్ర లింగాలయంలో కార్తీక పూజలు
జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాలయంలో మహాదేవునికి అభిషేకాలు, అన్నపూజ నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎంపీవో సస్పెన్షన్
ఇబ్రహీంపట్నం: ఎంపీవో రామకృష్ణరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18న కలెక్టర్ మండలంలోని డబ్బా, వర్షకొండ, ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. డబ్బా, వర్షకొండ గ్రామాల ఇందిరమ్మ ఇళ్లకు క్లస్టర్ అధికారి అయిన ఎంపీవో ఆ రోజు విధులకు గైర్హాజరయ్యారు. సమాచారం లేకుండా విధులకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. ఆయనను సస్పెండ్ చేశారు. బీర్పూర్ మండలంలో ఎంపీవోగా పనిచేసిన సమయంలోనూ రామకృష్ణరాజు ఇలాగే సస్పెండ్ అయినట్లు సమాచారం.
రైతులు అప్రమత్తంగా ఉండాలి


