పారితోషికం ఇప్పించండి
ప్రజాపాలన దరఖాస్తులను ఎంట్రీ చేసిన పారితోషికం ఇప్పటికీ రాలేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులను ఆదేశించి మా పారితోషికం ఇప్పించగలరు.
– డాటా ఎంట్రీ ఆపరేటర్లు
ఆస్తి లాక్కుని రోడ్డునపడేసిండు
నా భర్త మాదారపు గంగారాం 2009లో చనిపోయాడు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నా పేరున ఉన్న ఇల్లు, ఇంటిస్థలాన్ని గంగాధర్ తన పేరున రాయించుకున్నడు. నా వద్ద ఉన్న రూ.10లక్షలను నెలకు రూ.20వేల వడ్డీ ఇస్తానని చెప్పి తీసుకున్నడు. 15తులాల బంగారం కూడా లాక్కున్నడు. ఇంకా చిన్నకూతురు శాంతకు పెళ్లి చేయాల్సి ఉంది. గంగాధర్ నుంచి ఆస్తి, డబ్బులు, బంగారం ఇప్పించి కూతురు వివాహం జరిపించేందుకు సహకరించండి. వయోవృద్ధుల పోషణ చట్టం కింద నా సంరక్షణ బాధ్యతలు నా కొడుకే చూసుకునేలా ఆదేశించండి
– మాదారపు కనకమ్మ, జగిత్యాల
పారితోషికం ఇప్పించండి


