బీసీ రిజర్వేషన్‌కు కలిసి పోరాడుదాం
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
సారంగాపూర్: బీసీలకు 42 రిజర్వేషన్ సాధనకు పార్టీలకతీతంగా కలిసి పోరాడుదామని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన చిర్నేని రాజశేఖర్ గ్రూప్–2 ఫలితాల్లో ఎంపీవోగా ఉద్యోగం సాధించడంతో ఆయనను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. పేదరికం సమసిపోవాలంటే చదువు ఒక్కటే ఆయుధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మ్యాడ శ్రీనివాస్, ఎర్ర నర్సన్న, చీర్నేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


