గోదావరికి హారతి
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం తరఫున గోదావరికి మేళతాళాలతో వెళ్లి గోదావరిలో దీపాలు వదిలారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, అర్చకులు, మహిళలు తదితరులున్నారు.
డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెడతాం
జగిత్యాలటౌన్: కరీంనగర్ అర్బన్ బ్యాంకును ఇతర బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్ది డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెడతామని కరీంనగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ప్యానల్ అభ్యర్థులను పరిచయం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, విప్ ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో, జగిత్యాల ఎమ్మెల్యే మద్దతుతో 80శాతం ఓట్లు సాధించి తమ ప్యానల్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
జగిత్యాలటౌన్: కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను బలహీనపరుస్తూ హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్.రావు అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన యూనియన్ జిల్లా నాలుగో మహాసభను కో–కన్వీనర్ ఇందూరి సులోచన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మార్చి శాశ్వత ఉద్యోగులు లేని వ్యవస్థ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విలువైన ఖనిజాలు, దేశ సంపదను అంబానీ, ఆదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా నాయకులు వెంకటాచారి, ఎంఏ చౌదరి, జి స్వప్న, జంగిలి ఎల్లయ్య పాల్గొన్నారు.
భూపతిపూర్‌లో వినాయక విగ్రహం ప్రతిష్ఠ
రాయికల్: మండలంలోని భూపతిపూర్ హనుమాన్ ఆలయంలో వినాయక ప్రతిష్ఠ ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తికి అర్చకులు మహేశ్వర శర్మ, మహేష్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కాయితి మురళి, గ్రామ నాయకులు జక్కుల చంద్రశేఖర్ ,అన్నవేణి వేణు, బొడ్డుపల్లి విజయ్, హరీష్, మామిడాల నాగరాజు, దిలీప్ గంగారాజం, గోపి అరవింద్, శంకర్ పాల్గొన్నారు.
పోచమ్మ తల్లికి వెండి
ఆభరణాలు సమర్పణ
మల్యాల: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చెట్‌పల్లి మొండయ్య పోచమ్మ తల్లికి రెండున్నర కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఆదివారం స్థానిక పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి కిరీటం, కత్తి, డమరుకం, చేతులు, వడ్డాణం ఆభరణాలు సమర్పించారు. చెట్‌పల్లి రవి, మహేశ్, ఆనంద్ పాల్గొన్నారు.
గోదావరికి హారతి
గోదావరికి హారతి
గోదావరికి హారతి
గోదావరికి హారతి


