మల్లాపూర్: ఆరుగాలం పండించిన రైతులకు వానగండం తప్పడం లేదు. నైరుతిరుతుపవనాలు ముగి సినప్పటికీ ఎన్నడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో మక్కలు తడిసిపోతున్నాయి. కోతదశలో పొలాలు నేలవా రుతున్నాయి. హార్వెస్టర్లు అందుబాటులో ఉన్నా.. పొలంలోకి చేరేలోపే వర్షాలు పడుతున్నాయి. ఇలా వారంవరకు కోతలు ముందుకు సాగడం లేదు.
నైరుతి ముగిసినా..
ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు.. అక్టోబర్ మొదటి వారం వరకు నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. తర్వాత ఈశాన్య రుతుపవనాలు వచ్చినా అంతగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదు. అయితే ఈ ఏడాది మాత్రం జూన్ చివరలో బాగానే కురిసిన వర్షాలు.. జూలైలో మందగించాయి. అనంతరం ఆగస్టులో కాస్త ఎక్కువగా.. సెప్టెంబర్‌లో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి.
కోతలకు ఆటంకం
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 32,463 ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది. మరికొన్ని మండలాల్లో కోతదశలో ఉంది. వరుణుడు ఆటంకం కలిగించకుండా ఉంటే ఇప్పటికే కోతలు ముమ్మరంగా సాగేవి. దీపావళి ముగిసినా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో కోతలకు ఆటంకం కలుగుతోంది. పొలాలు ఆరడం లేదు. పైగా వర్షం కారణంగా నేలవాలుతున్నాయి.
‘నైరుతి’ ముగిసినా వీడని వర్షం
ముందుకు సాగని వరికోతలు
తడిసి మొలకెత్తుతున్న మొక్కజొన్నలు
ఆగని వాన.. కష్టాల్లో రైతన్న
ఆగని వాన.. కష్టాల్లో రైతన్న


