జగిత్యాలక్రైం: జిల్లాలో మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధి లోని 71 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించగా.. 1966 దరఖాస్తులు వచ్చిన విషయం తెల్సిందే. టెండర్‌దారులను ఎంపిక చేసేందుకు అధికారులు జిల్లాకేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. లక్కీడ్రా ద్వారా అదృష్టవంతులు ఎంపికకానున్నారు. ఎవరికి లక్కు తగులుతుందోనని టెండర్‌దారులు టెన్షన్ పడుతున్నారు. మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.58.98 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో 2,636 దరఖాస్తులు రాగా.. ఈసారి 1966 దరఖాస్తులు మాత్ర మే వచ్చాయి. అయితే ఫీజును రూ.3లక్షలకు పెంచడంతో గతంతోపోల్చితే ఈ సారి అదనంగా రూ. 6.26 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. అత్యధికంగా వెల్గటూర్ మండలకేంద్రంలోని షాపు నంబరు 45కు 61 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా కోరుట్ల పట్టణంలోని షాపు నంబరు 58, మొగిలిపేట షాపు నంబరు 65, వేములకుర్తి షాపునంబరు 71కు 16 దరఖాస్తుల చొప్పున దాఖలయ్యాయి. జగిత్యాల సర్కిల్ పరిధిలో 32 షాపులకు 948 దరఖాస్తులు వచ్చాయి. ధర్మపురి సర్కిల్ పరి ధిలో 14 షాపులకు 451, మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో 25 షాపులకు 567 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలోని 71 షాపులకు 1966 దరఖాస్తులు
రూ.58.98 కోట్ల ఆదాయం
టెండర్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం
గతంలో 2,636 దరఖాస్తులు
ఈ సారి పెరిగిన రూ.6.26 కోట్లు


