క్రీడలతో స్నేహభావం
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: క్రీడలతో స్నేహభావం అలవడుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీసు, ప్రెస్‌క్లబ్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విజేత పోలీసు టీం, రన్నర్ టీం ప్రెస్‌క్లబ్ సభ్యులకు బహుమతులు అందించారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, వెంకటరమణ, సీఐలు కరుణాకర్, నీలం రవి, రాంనర్సింహారెడ్డి, ఆరీఫ్‌అలీఖాన్, ఎస్సైలు కిరణ్, సదాకర్, నరేశ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాస్‌రావు, మహేశ్, మల్లారెడ్డి, సంపూర్ణాచారి, గోపాలాచారి, మదన్, రాజేశ్, హరి, శ్రీనివాస్, నరేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహభావం


