‘రోళ్లవాగు’ జాప్యానికి గత ప్రభుత్వానిదే బాధ్యత
సారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు పనుల జాప్యానికి గత పాలకుల వైఖరే కారణమని మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రోళ్లవాగు ఆధునీకరణను పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.60 కోట్లతో పనులు చేపట్టిందని, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.153 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అటవీశాఖకు చెందిన 900 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో రెవెన్యూ భూములు కేటాయించిందని, పనుల పురోగతికి రూ.30 కోట్లు విడుదల చేసిందని, నవంబర్ నాటికి మూడు షట్టర్లు బిగించి యాసంగికి నీరు అందిస్తామన్నారు. బీర్‌పూర్ ఘాట్ రోడ్డు మూలమలుపులతో ప్రమాదాలకు నెలవుగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంట విండో చైర్మన్ పొల్సా ని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీమంత్రి జీవన్‌రెడ్డి


