‘ఎస్‌ఐఆర్’ జాబితా పకడ్బందీగా తయారుచేయాలి
జగిత్యాల: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జాబితాను పకడ్బందీగా తయారుచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2002లో చేసిన ఎస్‌ఐఆర్‌తో 2025 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్‌స్థాయి అధికారుల సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో కేటగిరి ‘ఏ’ ని బీఎల్వో యాప్ ద్వారా ధ్రువీకరిస్తామని, కేటగిరి సీ, డీ లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లో ఇద్దరు బూత్‌స్థాయి అధికారులను కేటాయించి మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. మెట్‌పల్లి, కోరుట్ల ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్‌రెడ్డి, ఏవో హకీం పాల్గొన్నారు.


