విద్యార్థికి మంత్రి పరామర్శ
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో గాయపడిన విద్యార్థి హిమేశ్‌చంద్రను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని మంత్రి లక్ష్మణ్‌కుమార్ శనివారం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అత్యవసర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు మంజూరు చేశారు. అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎన్‌సీడీడీ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, ఆస్పత్రి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోపి కృష్ణ, డీడీ ప్రవీణ్‌రెడ్డి, ఏడీ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. కాగా.. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. ఎస్సీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తక్షణమే హైటెన్షన్ వైర్లు తొలగించాలని, లేకుంటే హాస్టల్‌ను మార్చాలని జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం, సురుగు శ్రీనివాస్, సతీశ్ అన్నారు.


