
ఆ పక్క.. ఈ పక్క.. మక్క
ఈ వర్షకాలంలో రైతులు వేసిన మొక్కజొన్న పంట చేతికి రాగా, రోడ్లపైనే
కంకులను ఆరబెడుతున్నారు. రోడ్డులో సగ భాగం వరకు కంకులను పోసి, పక్కన బండరాళ్లను పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం– మూలరాంపూర్ రోడ్డుపై మొక్కజొన్న కంకులు పోయడంతో ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో, మరో జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇలా రోడ్డుపై కంకులను ఆరబెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.– ఇబ్రహీంపట్నం(కోరుట్ల)