
ముగిసిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు
జగిత్యాలటౌన్: నాలుగురోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. నాల్గో రోజు పోటీలను జిల్లా విద్యాధికారి రాము ప్రారంభించారు. చివరి రోజు అండర్– 17 బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ మొదటి స్థానంలో మెట్‌పల్లి, రెండో స్థానంలో రాయికల్, వాలీబాల్ మొదటి స్థానంలో మెట్‌పల్లి, ద్వితీయ స్థానంలో వెల్గటూర్, ఖోఖో మొదటి స్థానంలో కోరుట్ల, ద్వితీయ స్థానంలో మేడిపల్లి నిలిచాయని డీఈవో తెలిపారు. క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్ పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి చక్రధర్‌రావు క్రీడా నివేదిక సమర్పించారు. పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శి అశోక్, పీడీలు పడాల కృష్ణప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మీరాంనాయక్, అజయ్‌బాబు, కోటేశ్వర్‌రావు, కొమురయ్య, వెంకటలక్ష్మి, మాధవీలత, జమునారాణి, మల్లేశ్వరి, రవి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
డిజిటల్‌పై నైపుణ్యం పెంపొందించుకోవాలి
జగిత్యాల: ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న డిజిటల్ లిటరసిలో భాగంగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్‌లో గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు డిజిటల్‌పై నైపుణ్యం పెంపొందించుకోవాలని, విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించి బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లు, డిజిటల్ లైబ్రరీలు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ, డేటా సైన్స్‌లపై నేర్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వ డం జరుగుతుందన్నారు. సెక్టోరియల్ అధికా రి రాజేశ్, జయసింహారావు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు